Smriti Mandhana: భారత్ కు స్మృతి మంధాన కెప్టెన్...! 1 d ago
సొంతగడ్డపై ఐర్లాండ్ తో జరిగే మూడు వన్డేల సిరీస్ లో భారత మహిళల జట్టుకు స్మృతి మంధాన సారథిగా వ్యవహరించనుంది. రెగ్యులర్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కు విశ్రాంతినిచ్చిన సెలక్టర్లు మంధానకు ఈ బాధ్యతలు అప్పగించారు. గత నెలలో స్వదేశంలో వెస్టిండీస్ తో జరిగిన సిరీస్ లో హర్మన్ ప్రీత్ మోకాలికి గాయమైంది. దీంతో టీ20 సిరీస్ లో ఆఖరి రెండు మ్యాచ్లకు దూరమైంది. తర్వాత మూడు వన్డేల సిరీస్ లో ఆమె పునరాగమనం చేసింది. కానీ ముందు జాగ్రత్తగా సెలక్టర్లు హర్మన్ ప్రీత్ కు విశ్రాంతినిచ్చారు. పని భారాన్ని తగ్గించే ఉద్దేశంతో పేసర్ రేణుక సింగ్ పేరును కూడా పరిగణనలోకి తీసుకోలేదు. ఇటీవల వెస్టిండీస్తో మూడు వన్డేల సిరీస్లో రేణుక పది వికెట్లు పడగొట్టింది. జనవరి 10న రాజ్ కోట్ లో తొలి వన్డేతో భారత్-ఐర్లాండ్ సిరీస్ మొదలు కానుంది. మిగిలిన రెండు మ్యాచ్లు (12, 15వ తేదీల్లో) కూడా ఇదే వేదికలో జరగనున్నాయి.